Tuesday, November 26, 2013

జీఒఎం కి వచ్చిన ఈ మెయిళ్లు ఎన్ని ?

ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల అంశాన్ని కేంద్ర కాబినెట్ సమావేశ ఎజెండా లో చేర్చకుండా కేవలం టేబుల్ పాయింటుగా ప్రవేశ పెట్టి తొండి చేసిన రీతిగా ఆమోదించడమే గాక  పార్టీల లేఖల ఆధారంగా విభజన ప్రక్రియని జరుపుతున్నామని అడ్డగోలుగా ప్రకటించిన కేంద్రం తూతూ మంత్రంగా ప్రజలనుండి విభజన అంశాలపై ఈ మెయిల్ అభిప్రాయాలని ఆహ్వానించింది.   నవంబరు 5 వ తేదీ గడువుగా చెప్పిన కేంద్రం ఆ తరువాత జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడా ప్రజలనుండి వచ్చిన సూచనలు, సలహాల ప్రస్తావనే తీసుకురాలేదు.  జీఒఎం నివేదిక కి తుది మెరుగులు దిద్దుతున్న ప్రస్తుత సమయంలో కూడా రెండు ప్రాంతాల రాజకీయనాయకులని, పార్టీలని చర్చలకి పిలుస్తున్నారు కానీ ప్రజాభిప్రాయం ఏమిటి అన్నది కేంద్ర ప్రభుత్వానికి పట్టటంలేదు.  అసలు విభజన కోసం ఈమెయిల్ ద్వారా సలహాలని కోరటమే తప్పు.  మన రాష్ట్ర ప్రజానీకంలో ఈమెయిల్ ద్వారా సూచనలు ఇవ్వగల నిపుణత ఎంతమందికి ఉంది?  వచ్చ్చిన ఈమెయిళ్ళు అన్నీ పూర్తి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయా?  ప్రజాభిప్రాయానికి విలువని ఇవ్వదలుచుకుంటే కేవలం ఈమెయిల్ మాత్రమె గాక తక్కిన మాధ్యమాల ద్వారా కూడా సూచనలు ఆహ్వానించాలి.  రాష్ట్రంలోని అన్ని వర్గాల నుండి సమాచారం/అభిప్రాయాలు సేకరించి విశ్లేషించి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికని బుట్ట దాఖలు చేసి తన చిత్తం వచ్చినట్లుగా కేంద్రం విభజన ప్రతిపాదన చేసింది.  ఆ తరువాత సీమాంధ్రుల సమస్యలు తీర్చటానికి (?) ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ నివేదిక ఇవ్వకుండానే విభజనకి తన చిత్తానుసారం పరుగులు తీస్తోంది.     ఇవన్నీ పక్కన పెడితే --- అసలు జీవోఎం కి మొత్తం ఎన్ని ఈ మెయిల్స్ వచ్చాయి - వాటిలో రాష్ట్ర విభజన కోరినవి ఎన్ని, సమైక్యతని కోరినవి ఎన్ని -  అసలు అన్ని మెయిళ్ళని  జీవోఎం పరిశీలించిందా లేదా బుట్ట దాఖలు చేసిందా?  అధికారికంగా సూచనలు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం తనకు అందిన ప్రతి సూచనకి జవాబుదారీగా ఉండాలి.  జీవోఎం  ఇవ్వబోయే నివేదికలో ప్రజలనుండి తనకి అందిన సూచనల/సలహాల వివరాలు కూడా పొందుపరచి తీరాలి. కాని పక్షంలో ఇప్పటికే  ఏకపక్షంగా అడ్డగోలుగా సాగుతున్న విభజన ప్రక్రియ కీలకమైన ప్రజాభిప్రాయాన్ని కూడా విస్మరించి సాగిస్తున్న నిరంకుశ చర్యే అవుతుంది.

7 comments:

  1. కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీమాంధ్రవారు ఆరోపిస్తున్నారు.
    కేంద్రం పూర్తిగా సవ్యంగానే వ్యవహరిస్తోందని తెలంగాణావారు అభిప్రాయపడుతున్నారు.

    కేంద్రం రాజకీయప్రయోజనాలకోసమే రాష్ట్రవిభజన చేస్తోందని సీమాంధ్రవారి అభియోగం.
    కేంద్రం తెలంగాణాప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్రవిభజన చేస్తోందని తెలంగాణావారి విశ్వాసం.

    కేంద్రం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోవటం‌లేదని సీమాంధ్రుల ఆవేదన.
    కేంద్రం పట్టించుకోవటానికి అసలు సీమాంధ్రలో ప్రజాఉద్యమమే లేదని తెలంగాణావారి ఆక్షేపణ.

    ఇంత గడబిడ జరుగుతున్న ప్రాంతంలో విస్తృతస్థాయి ప్రజాభిప్రాయం సేకరించి ఒక నిర్ణయం తీసుకుని కార్యాచరణకు పూనుకోవటం సముచితం. కాని మనది ప్రజాస్వామ్యం ముసుగులోని పార్టీస్వామ్యం. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే ఒకప్రత్త్యేకరాచకుటుంబస్వామ్యం. అలాంటప్పుడు ప్రజలూ అభిప్రాయాలూ అన్న మాటలు కంఠశోష. జరిగే దాని మంచిచెడు పరిణామాలను అనుభవించటం‌ తప్ప ప్రజలు చేయ గలిగింది ఏమీ కనిపించటం లేదు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ప్రజలు చేయగలిగింది ఏమీ కనిపించటం లేదు అని నిట్టూరుస్తున్నంత కాలం ఈ దురాగతాలు జరిగిపోతూనే ఉంటాయి. చేయగలిగిన ప్రయత్నం చేసి తీరాలి. ఈ విషయంలో కేంద్రం ప్రజలనుంచి అధికారికంగా సలహాలు/సూచనలు ఆహ్వానించింది కాబట్టి, నివేదిక తయారు చేసే సమయంలో వాటిని పరిగణనలోకి తీసుకోక తప్పదు. కాని పక్షంలో ఈ విభజన ప్రక్రియనే న్యాయస్థానాల ముందు లేదా రాష్ట్రపతి వద్ద సవాల్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. జీవోఎం కి వచ్చిన మెయిల్స్ యొక్క సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద సంపాదించే ప్రయత్నం చెస్తాను. సమైక్య వాదులు కూడా ఈ సమాచారాన్ని కేంద్ర హొమ్ శాఖ నుండి పొందటానికి ఇబ్బడి ముబ్బడిగా విజ్ఞాపనలు చేస్తే ( link: http://rtionline.gov.in ) కేంద్రం తన దూకుడు తగ్గించే అవకాశం ఉంది. అప్పుడు ప్రజల విజ్ఞాపనలన్నీ తన నివేదికలో జీవోఎం ప్రతిఫలించిందా లేదా తమ అధిష్టానం ఆదేశానుసారం తయారు చేసిందా అన్నది తేట తెల్లమై పోతుంది...

      Delete
  2. అన్నట్ము ఈ జీవోయంవారికి 18000కు పైగా ఈమెయిళ్ళు వచ్చాయట, అయినా పంపినవారి పిచ్చిగాని, ఈమెయిళ్ళు పంపవచ్చును అన్నారు కాని అవన్నీ చదువుతామని దొరతనంవారు నియమించిన ఈ జీవోయంగాని ఎన్నడైనా ప్రకటించిందా? కుశ్శంకలు దేనికీ? ఈ‌జీవోయంవారు చదివేది రాచకుటుంబంవారి ఫర్మానాలు మాత్రమే అని తెలియని వారు అక్షరాలా అజ్ఞానులే కదా? అసలు జోవోయంవారి పేరుమీద విడుదలయ్యే ప్రతిముక్కా కూడా ఏతన్మహాకుటుంబంవారి అనుగ్రహపూర్వకమైన ఉత్తరువు మాత్రమే కదా!

    ReplyDelete
  3. మనం బ్లాగ్ లో ఎంత చించుకున్నా రోజు రోజుకి మనకి మైనస్ తెలంగాణా వాళ్లకి ప్లస్ అవుతూనే ఉన్నాయి పరిణామాలు. మన ప్రజా ప్రతినిధులు దద్దమ్మలు. స్వలాభం కోసం సొంత ప్రాంతాన్నే తాకట్టు పెట్టిన వెధవలు. వీళ్ళకంటే తెలంగాణా నాయకులు నయం. ఎంత నికృష్టంగా మాట్లాడినా కనీసం వాళ్ళ ప్రాంతానికి రావాల్సిందానికంటే ఎక్కువే సాధిస్తున్నారు.

    మరి మన దద్దమ్మలకి వచ్చే ఎన్నికల్లో అయినా ప్రజలు బుద్ది చెప్తారా లేక వాళ్ళనే ఎన్నుకుని సీమాంధ్ర ప్రజలకి సిగ్గు, శరం, మానం, అభిమానం లాంటివి లేవని (కచరా చెప్పినట్టు) నిరూపించుకుంటారా చూడాలి.

    ReplyDelete
  4. ఇది చర్విత చర్వణం అయినా గాని, ఈ విభజన విషయం మనకు మంచిదే అని నాకనిపిస్తున్నాది. ఎంత కాలం ఇలా మోసపోతూనే ఉంటాము.మన నీళ్ళూ, కరంట్ దోచుకున్నారు. మన శ్రమ, రక్తం జలగల్లా పీల్చారు.వాళ్ళూ పరాన్నభుక్కులు. ఇది ఒక మంచి అవకాశం. ఒక రకంగా పీడ విరగడయ్యింది, శని వదిలింది అని అనుకోవాలి. ఆంధ్రులలో ఉన్న గొప్ప శక్తి వాళ్ళ కష్ట పడే తత్త్వం, రిస్క్ తీసుకునే స్వభావం వల్లే ఇంతగా అభివృద్ది చెందారు. అవతలవాడు ఎన్ని అబద్దాలు చెప్పిన, ఎంత విషం, విద్వెషం కక్కినా అది వాడి స్వభావం తప్ప దాని వల్ల మనకేం నష్టం లేదు. అయితే ఇది అనుకొన్నంత, చెప్పినంత సులభం కాదు.మన భవిష్యత్ తరాలు మనల్ని తిట్టుకోకూడదు. మనం ఎలాగ నష్ట పొయాం 1972 లొ విడిపోకుండా ఉండడం వలన.దెశమంటే మట్టి కాదొయి, దేశమంటే మనుషులోయి. ఇంతకు ముందు ఒక టపా లొ చదివినట్టు, అమెరికా అక్కడ వేల సంవత్సరాల నుండి ఉంది, కాని అభివృద్ది చెందింది ఇప్పటి తరం పూర్వికులు వెళ్ళిన తర్వాతే. .we should not bother about the other side.it is natural for the other side to be jealous, as they are incompetent and third rated lazy society.we should not be part of that lazy society. That is why they joined hands with the foreigners.they are the modern "Jayachandars".we should use our greatest asset in the form of "humans", who can think, and are hardworking, creative,enterprising,risk taking and progressive.

    ReplyDelete
  5. @ Anonymous 2
    Now you are talking about foreigner. Why did you defeat Vajpayeeji who was for Hindutva and elected the foreigner with thumping majority in 2004?
    You people are always selfish and want only your motives to be fulfilled.
    We are not lazy. We are self content. Not so ambitious like you people,
    to enjoy our own things and also grab that of others.
    Can you answer how people like P.V.Narasimha Rao, Shyam benegal, Neralla Venumadhav, Dr.Dasarathi, Kaloji, Dr,C.Narayana Reddy, Cricketers - Mohd. Azharuddin, Shivlal Yadav, Bollywood Music Director of earlier days - Shankar, Film Hero Kantha Rao, Sanskrit Scholar Kesavapantula Narasimha Sastry, Present Cine writers - Suddala Asok Teja, Chandra Bose, Eternal Legends - Suravaram Pratapa Reddy, Swami Ramananda Tirtha and many.. many... have made India proud by coming from same - so called "LAZY SOCIETY"?
    Don't talk rubbish without justifying.
    I know you people won't answer my questions, but start abusing me.
    But remember ... The Truth Prevails!

    ReplyDelete
  6. విభజన జరుగుతున్న తీరు చాల ఘోరంగా ఉంది. కేంద్రంలో ఉన్న తమ అధిష్టానం అన్ని పార్టీల వాళ్ళూ మేము తెలంగాణా యేర్పాటుకు సుముఖమే అని ఒప్పుకున్నాకనే ప్రకటన చేసింది గదా. మరి యెందుకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెసు వాళ్ళు రెండు ముఠాలుగా చీలిపోయారో యెవరికయినా అర్ధ మవుతుందా అసలు? అన్ని పార్టీల వాళ్ళూ యేదో ఒక సందర్భంలో గులాబీ కండువా భుజాన వేసుకుని తిరిగారు, మాకు అభ్యంతరం లేదని లేఖలు కూడా ఇచ్చారు ఇవ్వాళ సమైక్యం గురుంచి మాట్లాడటమేమిటి అర్ధం లేకుండా?మిగతా పార్టీ లేవీ అధికారంలో లేవు గాబట్టి యెలా మాట్లాడినా పెద్దగా నష్టముండదు. కానీ వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళుగా విభజన వల్ల యే ప్రాంతమూ నష్టపోకుండా చూడాల్సిన బాద్యత ఉన్నది వీళ్ళ మీద. పయిగా ఇవాళ విభజన జరుగుతున్న తీరు సాంకేతికంగా యెన్నో లోపాలతో కూడిన దుష్ట భూయిష్ట నికృష్టమయిన రాజ్యాంగ విరుధ్ధమయిన పధ్ధతిలో నడుస్తున్నది. ఈ గాడిదలు ఒకడేమో విభజన ఆపాలని చూడ్డం, మరొకడు మేడం, మేడం నన్ను ము.మం. ని చెయ్యండి - నేను మీకెలా కావాలంటే అలాగ చక్కగా చేసి పెడతానని పైరవీలు చెయ్యటం. యేమిటిదంతా - డాం షిట్ ఆఫ్ ఇండియా. ఇంత కాలం ఉద్యమం జరిగి అందరూ ఒప్పుకుని తీరా ప్రకటన జరిగాక విభజన ఆపటం అంటే నిజంగా కిరాతకమయిన పని. సాంకేతిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండి ఇరు ప్రాంతాల వాళ్ళనీ సమాధాన పర్చటం బదులు ఈ వెధవ్వేషాలు దేనికి వేస్తున్నారో తెలుసా? అలవాటు లేకపోవటం వల్ల! కుంపట్లు రగిలించటమే తెలిసిన వాళ్ళు తొలి సారి ఆర్పటానికి తగులుకుంటే - పిల్ల కాలవ ఈదలేని వాడు సముద్రాన్ని ఈదుతానని పట్టుబడితే - ఇలాగే తగలడుతుంది మరి?!

    అసలు ముఖ్యంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని పరిష్కరించకుండా యే సభలోనూ చర్చ అనేది జరక్కుండా విడగొట్టటం మాత్రమే తను చేసి సమస్యల్ని పరిష్కరించుకోవటం మాత్రం విడిపోయాక ఈ రెండు రాష్ట్రాల వాళ్ళు పరిష్కరించుకోవాలనే విధంగా చెస్తున్నది. అదీ అసలయిన ప్రమాదం. యెట్టి పరిస్తితిలోనూ కలిసి వుండకూడదనే వాళ్ళూ యెట్టి పరిస్తితిలో విడిపోవటానికి ఒప్పుకోని వాళ్ళూ ఈ అపరిషృతంగా వొదిలేసిన సమస్యల్ని పరిష్కరించుకోవటానికి యెన్నేళ్ళ్ళు పడుతుందో యెవరయినా వూహించగలరా? అవిభక్తంగా ఉన్న ఇప్పటి రాష్ట్రంలోనే తెలంగాణా ఉద్యమం మొదలయిన ఈ పదేళ్ళలో కొత్తగా పెట్టుబడులు లేవు, కొత్త పరిశ్రమలు రాలేదు.రాజకీయంగా సమస్యలతో కొట్టుమిట్టాడే యే రాష్ట్రంలోనూ మెడ మీద తలకాయ ఉన్న వాడెవడూ తన పరిశ్రమని స్థాపించడు, పెట్టుబడి పెట్టడు.ఇప్పటికే దాని ఫలితం కనబడుతుంది.ఇలా ఇంత హడావుడిగా విడిపోవటం వల్ల రేపు యేర్పడబోయే తెలంగాణా ర్రాష్టానికి కూడా దేన్ని ఆశించి వాళ్ళు విడిపోతున్నారో అది దక్కదు.

    రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ వాళ్ళని(తెకావాలతో సహా) కూడా పట్టించుకోకుండా 2014 యెన్నికల కల్లా తెలంగాణాని విడొగొట్టెయ్యాలని యెందుకు ఉవ్విళ్ళూరుతుందో తెలుసా?అందరూ అనుకుంటున్నట్టుగా రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యటానికి మాత్రం కాదు. దేశమంతటా ఉన్న వ్యతిరేకత తోనూ సీమాంధ్రలో వొచ్చే గుండుసున్న తోనూ కలిపితే తెలంగాణాలోని కొద్ది సీట్లతో అది యెలా సాధ్య పడుతుంది?కాంగ్రెసుకీ కచరాకీ కుదిరిన అసలు ఒప్పందం వేరే ఉందని నా అనుమానం. అందుకే రెండు వర్గాలూ విలీనం గురించి ఇద్దరూ అంతగా పట్టించుకోవటం లేదు. దిగంబరం, డిగ్గీ కూజా మహద్ టపేల్ లాంటి కోటరీ ప్రముఖులకి వాళ్ళ సొంత రాష్ట్రాల్లో గిలిచి పార్లమెంటుకు రాగలిగిన స్తితి లేదు. వాళ్లందరికీ నమ్మకమయిన సీట్లు తెలంగాణా ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఇవ్వాల్సి ఉంటుంది.అంటే డిల్లీ మహారాణీ వారి పెంపుడు కుక్కలకి పదవీ భద్రత పధకంగా తెలంగాణా విభజన జరుగుతున్నది. కాంగ్రెసు కొరకు కాంగ్రెసు చేత నడపబడుతున్న వారి అంతర్గత వ్యవహారమే తప్ప తెలంగాణా వాదులకి కూడా ఇందులో యెటువంటి భాగస్వామ్యమూ లేదు.

    మిగతా వ్యవహారాలన్నీ విడిపోయిన రెండు రాష్ట్రాల వాళ్ళూ కనీసం యాభయ్యేళ్ళ పాటూ పోట్లాదుకోవటానికయినా సిద్దపడి తేల్చుకోవాల్సి ఉంటుంది.
    స్వస్తి.

    ReplyDelete